![]() |
![]() |

దగ్గుబాటి రానాకు కాబోయే శ్రీమతి మిహీకా బజాజ్ ఉన్నారు కదా! మొన్నామధ్య రోకా వేడుకలో రానాతో కలిసి నవ్వులు చిందించారు. గుర్తుందా? ఆ వేడుకలో ఆమె వేసుకున్న నగలు ధగధగ మెరిసిపోయాయి. అవి ఎవరివో తెలుసా? రాయల్ ఫ్యామిలీ జ్యూవెలరీ. బికనీర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన పురాతన నగలను రోకా వేడుకలో మిహీకా వేసుకున్నారు. వాటికి కొన్ని మెరుగులు అద్దారు అనుకోండి. క్రాసల జ్యూవెలరీ బ్రాండ్ మిహీకా బజాజ్ ఫ్యామిలీదే. ఆమె తల్లి బంటీ బజాజ్ ప్రముఖ నగల డిజైనర్. కూతురి పెళ్ళికి ఆ మాత్రం స్పెషల్ జ్యూవెలరీ డిజైన్ చేశారు కదా!
ఆగస్టులో (8వ తేదీన) మిహీకా బజాజ్‌తో కలిసి రానా దగ్గుబాటి ఏడడుగులు వేయనున్నాడు. అంతకు ముందు రెండు రోజులు పెళ్లి వేడుకలు (సంగీత్, గట్రా) జరగనున్నాయి. ప్రస్తుతానికి తక్కువ మందితో పెళ్లి కానిచ్చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ అప్పటికి పరిస్థితులు మెరుగు పడితే 50 మంది కంటే ఎక్కువ అతిథులను ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు.
![]() |
![]() |